FIRST T20: భారత్‌కు 177 పరుగుల లక్ష్యం నిర్దేశించిన కివీస్

రాంచీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ20లో ఒక దశలో 200 పరుగులకు పైగా చేస్తుందనుకున్న న్యూజిలాండ్ జట్టు చివరికి 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. రన్ ఔట్లు మలుపు తిప్పాయి. చివర్లో డారెల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 30 బంతుల్లోనే 59 పరుగులు (5 సిక్స్‌లు, 3 ఫోర్లు) చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో తొలి మూడు బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ బాదాడు. చివరి ఓవర్‌లో మొత్తం 27 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ ముంగిట కివీస్ 177 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్ జట్టుకు డేవిడ్ కాన్వే, ఫిన్ అలెన్ శుభారంభాన్ని ఇచ్చారు. డేవిడ్ కాన్వే ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. 35 బంతుల్లో 52 పరుగులు (7 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు. ఫిన్ అలెన్ (35 పరుగులు, 23 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా దాటిగా ఆడాడు.

2023-01-27T15:24:49Z dg43tfdfdgfd