Eoin Morgan | స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలకమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. 2011లో భారత్‌లో వరల్డ్‌కప్ జరగ్గా.. మళ్లీ పుష్కర కాలం తర్వాత మెగాటోర్నీకి మన దేశం ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై రోహిత్ సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా గనక 5 నుంచి 6 ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే భారత్‌కు తిరుగుండదని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఉన్న అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో హార్దిక్ ముందు వరుసలో ఉంటాడని.. అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో బౌలింగ్ చేస్తే.. రోహిత్ సేనకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించాడు.
‘వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు హార్దిక్ ఎంతో కీలకం కానున్నాడు. అతడు ఫిట్‌గా ఉండి మ్యాచ్ మధ్యలో 5-6 ఓవర్లు బౌలింగ్ చేస్తే.. అది టీమ్‌కు ఎంతో ప్రయోజనకరం. ఆసియాకప్‌లో అతడి బౌలింగ్ చూస్తే మునుపటి వేగం కనిపించింది. వరల్డ్‌కప్‌లో ఆడే ఇతర జట్లలో హార్దిక్ వంటి నాణ్యమైన పేస్ ఆల్‌రౌండర్ ఉన్న జట్లు చాలా తక్కువ. అతడు పూర్తి టోర్నీకి అందుబాటులో ఉండి మెరుగైన ప్రదర్శన చేయాలని ఆ జట్టు కోరుకుంటుంటుంది. ఎందుకంటే టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యంతో పాటు కీలక సమయాల్లో బంతితో వికెట్లు తీసే సత్తా పాండ్యాలో ఉంది’ అని మోర్గాన్ అన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు తొలిసారి ట్రోఫీ అందించిన మోర్గాన్.. హార్దిక్ బౌలింగ్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని అన్నాడు. కాగా.. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆసియాకప్ సూపర్-4లో బంగ్లాదేశ్‌తో జరిగిన నామమాత్రమైన పోరులో హార్దిక్‌కు విశ్రాంతినిచ్చారు. లంకతో ఆదివారం జరగనున్న ఫైనల్లో పాండ్యా బరిలోకి దిగనున్నాడు.
2023-09-17T03:52:58Z dg43tfdfdgfd