England- Team India | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య ముంబైలో జరుగుతున్న ఐదవ, చివరి టీ-20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ శతకం పూర్తి చేశాడు. టాస్ గెలుచుకున్న ఇంగ్లండ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. 10.1 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఐదు ఫోర్లు, పది సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ 16 పరుగులు చేసి వుడ్ బౌలింగ్‌లో ఆర్చర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ, సారధి సూర్య కుమార్ యాదవ్ ఔటయ్యారు. తిలక్ వర్మ 24 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ రెండు పరుగులు చేశారు. తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ కార్స్ బౌలింగ్‌లోనే సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టారు.
2025-02-02T14:41:34Z