ELLYSE PERRY RCB: అందం, ఆటే కాదు.. అంతకుమించి మంచి మనసు ఎల్లిస్ పెర్రీది! ఆ పనికి ఫ్యాన్స్ ఫిదా

Ellyse Perry picks up bottles and garbage after match in WPL 2023: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతోనే కాదు అద్భుత ఆటతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో విజయాలు అందించింది. ఆసీస్ తరపున 10 టెస్టులు, 131 వన్డేలు, 139 టీ20లు ఆడింది. అద్భుతంగా ఆడే ఎల్లీస్ పెర్రీ‌కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. తాజాగా ఎల్లీస్ పెర్రీ‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మైదానంలో తన చర్యలతో పెర్రీ అందరిని ఆకట్టుకున్నారు. 

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్లూపీఎల్)‌ 2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌ (ఆర్‌సీబీ)కి ఎల్లిస్ పెర్రీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. డబ్లూపీఎల్ 2023లో భాగంగా  ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ముగియగానే స్టార్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ తన డగౌట్ పరిసరాలను శుభ్రం చేసింది. డగౌట్‌లో సహచర ప్లేయర్స్ వాడిన వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, తినుబండారాల చెత్తను గార్బెజ్ కవర్‌ పట్టుకొని శుభ్రం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఎల్లిస్ పెర్రీపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఎల్లిస్ పెర్రీ డగౌట్ క్లీన్ చేయడం ఇదే తొలిసారి మాత్రం కాదు. గతంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ఇలానే చెత్తను సేకరించి డస్ట్‌బిన్‌లో  వేసింది. ఎల్లిస్ పెర్రీ ఈ విషయంపై మాట్లాడుతూ... 'మనం ఆడిన చోటును ఎప్పుడూ గౌరవించాలి. అందుకే ఇలా చెత్తను సేకరించి డస్ట్‌బిన్‌లో వేస్తాను. ఇది నా అభిప్రాయం మాత్రమే' అని తెలిపింది. పెర్రీ ఇలా క్లీన్ చేయడం ఎంతోమందికి స్పూర్తిదాయకమని చెప్పొచ్చు. 

డబ్లూపీఎల్ 2023లో ఆర్‌సీబీ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేయలేదు. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఆర్‌సీబీ తరఫున ఎల్లిస్ పెర్రీ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. నేడు యూపీ వారియర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే ఆర్‌సీబీ అధికారికంగా 'ప్లే ఆఫ్స్' రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడంతో పాటు పాయింట్స్‌ టేబుల్‌లో మూడో స్థానంలో నిలవాలి. ఇది ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం ఇది దాదాపుగా అసాధ్యమే. 

ఆర్‌సీబీ జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ స్మృతి మంధానతో పాటు పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్, వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్ ఉన్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ సోఫీ డివైన్, ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ మరియు మేగాన్ షట్ వంటి స్టార్ ప్లేయర్ ఆర్‌సీబీ జట్టులో ఉన్నారు.

Also Read: ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ లేపిన ఆర్ అశ్విన్.. విరాట్ కోహ్లీ ఏకంగా..!  

Also Read: Honda Shine 100 CC: హోండా సరికొత్త బైక్.. ధర 65 వేలు మాత్రమే! సూపర్ లుకింగ్, బెస్ట్ మైలేజ్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

2023-03-15T14:56:10Z dg43tfdfdgfd