DISNEY+HOTSTAR: డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త రికార్డు.. ఫైన‌ల్‌ను వీక్షించిన 5.9 కోట్ల మంది

న్యూఢిల్లీ: వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు డిస్నీ+ హాట్‌స్టార్‌(Disney+Hotstar)లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అయిన విష‌యం తెలిసిందే. అయితే హాట్‌స్టార్ యాప్‌లో రికార్డు స్థాయిలో వ్యూవ‌ర్‌షిప్ న‌మోదు అయ్యింది. ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ క్రికెట్ మ్యాచ్‌ను సుమారు 5.9 కోట్ల మంది వీక్షించిన‌ట్లు భావిస్తున్నారు. ఇదే టోర్న‌మెంట్‌లో ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌ను 5.3 కోట్ల మంది వీక్షించారు. మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో అత్య‌ధిక సంఖ్య‌లో ఎంత మంది చూశార‌న్న దానిపై వ్యూవ‌ర్‌షిప్‌ను అంచ‌నా వేస్తారు. డిస్నీ హాట్‌స్టార్ లో పీక్ స‌మ‌యంలో సుమారు 5.9 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించిన‌ట్లు ఆ కంపెనీ తెలిపింది. ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ను అత్య‌ధికంగా 3.5 కోట్ల మంది వీక్షించారు. డిస్నీ స్టార్‌, స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేసిన ఫైన‌ల్ మ్యాచ్ గురించి పూర్తి వ్యూవ‌ర్‌షిప్ స‌మాచారాన్ని బ్రాడ్‌కాస్ట్ ఆడియ‌న్స్ రీస‌ర్చ్ కౌన్సిల్ మ‌రో వారంలో వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఆ కంపెనీ ఇండియా ఇంచార్జ్ స‌జిత్ శివానంద‌న్ తెలిపారు.

2023-11-20T08:02:29Z dg43tfdfdgfd