CWC 2023: వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించడం ద్వారా ఆసీస్ సారథి పాట్ కమిన్స్ తన దేశానికి ఆరో ఐసీసీ ట్రోఫీని అందించాడు. కమిన్స్ ఇంతకుముందు ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందించడమే గాక తాజాగా వన్డే వరల్డ్ కప్ కూడా అందుకున్నాడు. ఈ విజయం ద్వారా కమిన్స్ కూడా దిగ్గజ సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, రికీ పాంటింగ్, ఇయాన్ మోర్గాన్‌ల సరసన చేరాడు. ఈ నలుగురికీ ఒక విషయంలో స్పెషల్ కనెక్షన్ ఉంది. ఈ నలుగురూ వరల్డ్ కప్ గెలవడానికి ముందు ఏడాది పెళ్లి చేసుకోవడం విశేషం.
ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రికీ పాంటింగ్.. 2002 జూన్ 22న రియాన్నా కాంటర్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2003లో ఆసీస్.. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి కప్ గెలుచుకుంది.
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని.. 2010లో జులై 04న సాక్షిని వివాహమాడాడు. 2011లో భారత్.. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో గెలిచి రెండోసారి కప్ కొట్టింది.
ఇక ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ 2018 నవంబర్ 03న పెళ్లి తారా మోర్గాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్ 2019లో తొలిసారి వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.
తాజాగా ఆసీస్ సారథి పాట్ కమిన్స్ కూడా ఇదే కోవలోకి వచ్చాడు. కమిన్స్ గతేడాది ఆగస్టు 01న తన చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ బెక్సీ బాస్టన్‌తో వివాహబంధంతో ఒక్కటయ్యాడు. 2023లో అతడు ఏకంగా రెండు ఐసీసీ ట్రోఫీలు దక్కించుకోవడం గమనార్హం.
2023-11-20T13:32:53Z dg43tfdfdgfd