Chris Gayle: బుమ్రా కఠినమైన బౌలర్. తనను ఎదుర్కోవడం చాలా కష్టం: క్రిస్ గేల్
ఫార్మెట్ ఏదైనా బౌలర్లని ఊచకోత కోసే బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్. అందుకే యూనివర్సల్ బాస్ గా పేరు తెచ్చుకున్నాడు. ఏ బౌలర్ అయినా గేల్ కి బౌలింగ్ చేయడానికి భయపడేవాళ్లు. అయితే, ఓ టీవీ ఇంటర్వ్యూలో ‘మీరు ఎదుర్కున్న డేంజరెస్ బౌలర్ ఎవరు?’ అని అడిగి ప్రశ్నకు గేల్ సమాధానం ఇచ్చాడు.
‘ఐపీఎల్, టీ20 ఇంటర్నేష్నల్ లో నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ జస్ప్రిత్ బుమ్రా. అతని బౌలింగ్ తో నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. బుమ్రా వేసే యార్కర్, స్లో బాల్స్ నన్ను భయ పెట్టేవి. స్కోర్ చేయనిచ్చేవాడు కాదు. టీ20ల్లో బుమ్రా మార్క్ తప్పక ఉంటుంది. అతను చాలా ప్రత్యేకమైన బౌలర్. అతన్ని ఎవరూ అందుకోలేరు’ అంటూ జవాబిచ్చాడు.
©️ VIL Media Pvt Ltd. 2023-02-02T07:21:01Z dg43tfdfdgfd