BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త సెలెక్టర్‌గా అజయ్ రాత్రా(Ajay Ratra) ఎంపికయ్యాడు. ప్రస్తుతం సెలెక్టన్ ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన సలీల్ అంకోలా(Salil Ankola) స్థానాన్ని అజయ్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని మంగళవారం బీసీసీఐ (BCCI) వెల్లడించింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లోపు ఆయన బాధ్యతలు చేపట్టనున్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత జట్టు కోచింగ్ బృందంలో సభ్యుడైన అజయ్ .. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని బృందంతో అజయ్ కలిసి పని చేయనున్నాడు.
‘విశ్వ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించే కొత్త తరం ఎంపికలో ప్రస్తుతం ఉన్న సభ్యులతో కలిసి ఓ సెలెక్టర్‌గా రత్రా భాగం కానున్నాడు. అతడికి కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది. దేశవాళీలో అస్సాం, పంజాబ్, ఉత్తరప్రదేశ్ జట్లకు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. నిరుడు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు కోచింగ్ బృందలో అజయ్ సభ్యుడు’ కూడా అని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగుతున్నాడు. శివ్ సుందర్ దాస్, సుబ్రొతో బెనర్జీ, శ్రీధరన్ శరత్‌లు సెలెక్టర్లుగా ఉన్నారు.
హర్యానాకు చెందిన అజయ్ రత్రా వికెట్ కీపర్, బ్యాటర్‌గా రాణించాడు. ఫస్ట్ క్లాస్‌లో గొప్ప రికార్డే ఉన్నప్పటికీ అజయ్ టీమిండియా తరఫున ఆడింది తక్కువ మ్యాచులే. ఆయన 6 టెస్టులు, 12 వన్డేల్లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అజయ్ కోచింగ్ కెరీర్‌పై దృష్టి సారించాడు.