Agasara Nandini | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని మళ్లీ సత్తాచాటింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియం వేదికగా జరుగుతున్న 63వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నందిని పసిడి పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల హెప్టాథ్లాన్‌లో నందిని 5526 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
ఇదే విభాగంలో పోటీపడ్డ మౌమిత మండల్(5126), పూజ(5126) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలకడగా రాణిస్తున్న నందిని రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నది. జాతీయ అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించిన గురుకుల విద్యార్థిని నందినిని జూనియర్ ఛీప్ కోచ్ నాగపురి రమేశ్ అభినందించారు.
2024-09-02T23:33:59Z dg43tfdfdgfd