ACC CHIEF: జే షా స్థానంలో పాక్ క్రికెట్ బోర్డు చీఫ్‌

న్యూఢిల్లీ: బీసీసీఐ కార్య‌ద‌ర్శి జేషా.. ఐసీసీ కొత్త చైర్మెన్‌గా నియ‌మితుడైన విష‌యం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్‌గా కూడా ప్ర‌స్తుతం జే షా కొన‌సాగుతున్నారు. ఐసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించే లోపు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు కూడా జే షా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ న‌ఖ్వీ.. జే షా స్థానంలో ఏసీసీ కొత్త బాసు(ACC Chief)గా నియ‌మితుడ‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివ‌ర‌లోగా దీనిపై నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏసీసీ మీటింగ్ జ‌రిగినప్పుడు, రాబోయే రెండేళ్ల పాటు న‌ఖ్వీ అధ్య‌క్షుడిగా ఉంటాడ‌ని ప్ర‌క‌టిస్తార‌ని ఓ అధికారి తెలిపారు. జేషా త‌ప్పుకున్న త‌ర్వాత‌.. పీసీబీ చీఫ్‌కు ఆ బాధ్య‌త‌లు ఇవ్వ‌నున్నారు.

2024-09-02T07:33:42Z dg43tfdfdgfd