ముంబై బౌలింగ్ కోచ్‌గా ఝులన్ గోస్వామి
భారత మాజీ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామిని ముంబై ఫ్రాంచైజీ మహిళల ప్రీమియర్ లీగ్ తమ బౌలింగ్ కోచ్, మెంటార్‌గా నియమించింది. ఈ విషయాన్ని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించారు. ముందుగా ఆమెకు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆమెకు ఆఫర్ చేసినట్లుగా గంగూలీ చెప్పాడు. ప్రస్తుతం గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా ఉన్నాడు. 40 ఏళ్ల ఝులన్ గోస్వామి గత సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయింది. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఝులన్ గోస్వామి రికార్డు సృష్టించింది. గోస్వామి అన్ని ఫార్మాట్లలో కలిపి 355 అంతర్జాతీయ వికెట్లు తీసింది. ఇక టీంమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ మెంటార్, అడ్వైజర్‌గా సేవలు అందించనుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ల వేలం ఫిబ్రవరి 11 లేదా 13 న ముంబైలో జరిగే అవకాశం ఉంది, ఈ వారంలో బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది.
©️ VIL Media Pvt Ltd. 2023-02-01T11:35:43Z dg43tfdfdgfd