భువీ రికార్డు బద్దలు కొట్టిన చాహల్
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. లక్నోలో న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో ఫిన్ అలెన్ వికెట్ తీయడంతో చాహల్ భువనేశ్వర్ కుమార్ రికార్డును బద్దలు కొట్టాడు.
చాహల్ ఇప్పటివరకు 75 మ్యాచుల్లో 91 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచుల్లో 90 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 65 మ్యాచుల్లో 72 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 60 మ్యాచుల్లో 70 వికెట్లతో నాల్గో స్థానంలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 86 మ్యాచుల్లో 64 వికెట్లతో ఐదో ప్లేస్లో కొనసాగుతున్నాడు.
అటు టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ అగ్ర స్థానంలో ఉన్నాడు. సౌథీ 107 మ్యాచ్‌ల్లో 134 వికెట్లు దక్కించుకున్నాడు. బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ 109 మ్యాచ్‌ల్లో 128 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ 74 మ్యాచ్‌ల్లో 122 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
©️ VIL Media Pvt Ltd. 2023-01-30T10:49:41Z dg43tfdfdgfd