అండర్ 19 మహిళా క్రికెటర్లను సత్కరించనున్న సచిన్

అండర్ 19 మహిళా క్రికెటర్లను సత్కరించనున్న  సచిన్ 

ఇంగ్లండ్ పై గెలిచి తొలి అండర్ 19 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న మహిళల జట్టు సభ్యులను ఇండియన్ మాజీ క్రికెటర్  సచిన్ టెండూల్కర్, బీసీసీఐ అధికారులు సత్కరిస్తారని బీసీసీఐ కార్యదర్శి జెషా ట్వీట్ చేశారు. యువ క్రికెటర్లు భారతదేశం గర్వపడేలా చేసారని వారి విజయాన్ని మేము గౌరవిస్తామని జెషా తన ట్వీట్ లో పేర్కొన్నారు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం 6 : 30 నిమిషాలకు  ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.  దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో  షఫాలీ వర్మ నేతృత్వంలోని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి తొలిసారిగా ఐసీసీ అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇవాళ టీమిండియా జట్టు  దక్షిణాఫ్రికా నుండి ముంబైకి చేరుకుంటుంది. రేపు మోడీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20  సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది. 

  ©️ VIL Media Pvt Ltd.

2023-01-31T07:20:36Z dg43tfdfdgfd