కుల్దీప్ బౌలింగ్.. అనూహ్యంగా బంతి టర్న్

కుల్దీప్ బౌలింగ్.. అనూహ్యంగా బంతి టర్న్

లక్నో పిచ్ బ్యాట్స్మన్కు పిచ్చెక్కించింది. విపరీతమైన టర్నింగ్ ఉండటంతో బ్యాటర్లు స్పిన్నర్ల బౌలింగ్లో ఇబ్బంది పడ్డారు. సుడులు తిరిగే బంతులను ఎదర్కోలేక బ్యాట్స్మన్ టెంప్ట్ అయి వికెట్ పారేసుకున్నారు. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా కివీస్ బ్యాట్స్ మన్ డారెల్ మిచెల్ను ఔట్ చేసిన విధానం అద్భుతం. కుల్దీప్ బంతిని అంచనా వేయలేకపోయిన మిచెల్..బౌల్డ్ అయ్యాడు. 

10వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్..చివరి బంతిని  ఆఫ్ సైడ్ వేశాడు. అయితే పిచ్ పై ప‌డిన బంతి.. స‌డెన్‌గా షార్ప్ ట‌ర్న్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. మిచెల్ మాత్రం మిడిల్ స్టంప్‌పై ఆ బంతిని  అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ బాల్ మిచెల్ బ్యాట్ ను బోల్తా కొట్టించి వికెట్లను తాకింది. పిచ్‌లో అనూహ్య ట‌ర్న్ చూసిన మిచెల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ త‌న ట్విట్టర్ లో పోస్టు చేసింది.

©️ VIL Media Pvt Ltd.

2023-01-30T12:19:34Z dg43tfdfdgfd