అరుదైన రికార్డుకు 63 పరుగుల దూరం..
టీ20ల్లో టీమిండియా 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. పొట్టి ఫార్మా్ట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 47 పరుగులు చేసిన సూర్య..రెండో మ్యాచ్ లో ఓపిగ్గా బ్యాటింగ్ చేసి 26 పరుగులతో భారత్ ను గెలిపించాడు. ఈ క్రమంలో మూడో టీ20కి సిద్ధమైన సూర్యకుమార్ యాదవ్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
చివరి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ మరో 63 పరుగులు చేస్తే.. న్యూజిల్యాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్ మన్ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు. సూర్య ఇప్పటి వరకు 7 మ్యాచుల్లో 260 పరుగులు చేశాడు.
ఈ జాబితాలో కేఎల్ రాహుల్ 322 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ ను అధిగమించాలంటే సూర్య మరో 63 పరుగులు చేయాల్సి ఉంటుంది. కివీస్ పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ జాబితాలో రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను న్యూజిలాండ్ పై 511 పరుగులు సాధించాడు.
©️ VIL Media Pvt Ltd. 2023-02-01T11:50:41Z dg43tfdfdgfd