'కాలా చష్మా' పాటకు అండర్19 టీం క్రికెటర్ల స్టెప్పులు

'కాలా చష్మా' పాటకు అండర్19 టీం క్రికెటర్ల స్టెప్పులు

ఆదివారం జరిగిన ఐసీసీ మహిళల U-19 T20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ నేతృత్వంలోని జట్టు ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి తొలి ఐసీసీ మహిళల టీ20 టైటిల్‌ను గెలుచుకుని భారత్ చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్న వేళ ఓ బాలీవుడ్ సాంగ్ కు భారత జట్టు స్టెప్పులు వేసింది. ఇప్పటికే పాపులర్ అయిన 'కాలా చష్మా' పాటకు డ్యాన్స్‌ చేస్తూ ప్లేయర్స్.. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ICC పోస్ట్ చేసింది, "ఫీల్డ్‌లో, వెలుపల గెలిచింది. ఇండియా -ICC మహిళల అండర్19 T20 వరల్డ్‌కప్ ఛాంపియన్స్" అనే క్యాప్షన్ ను కూడా జత చేసింది. ఈ వీడియోలో ఛాంపియన్‌లు నీలిరంగు దుస్తులు ధరించి, మెడలో మెడల్‌లు ధరించి స్టైల్‌గా పెప్పీ పాటకు స్టెప్పులు వేశారు. వాళ్లంతా ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తున్నపుడు గెలిచిన ఆనందం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది.  అంతే కాదు ఈ ప్లేయర్స్ సినిమాలోని హుక్ స్టెప్‌ను వేసి, అందర్నీ ఆకర్షించారు.

ఈ వీడియో ఇప్పటివరకు దాదాపు 7 లక్షల లైక్‌లను, 3వేల కంటే ఎక్కువ కామెంట్లను సొంతం చేసుకుంది. ప్లేయర్స్ బ్రేక్ చేసిన ఈ రికార్డును అభినందిస్తూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఒకరు ''మహిళలు.. అనూహ్యంగా అందంగా ఉన్నారు'' అని, మరొకరు  వారు వచ్చారు, చూశారు, జయించారు'' అని రిప్లై ఇచ్చారు. ఇంకొకరేమో "టీమ్ ఇండియా నమ్మశక్యం కాని ప్రదర్శన" అని వ్యాఖ్యానించారు.

  ©️ VIL Media Pvt Ltd.

2023-01-30T05:34:29Z dg43tfdfdgfd