బాబర్ ఆజమ్ జాక్ పాట్.. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా పాకిస్థాన్ కెప్టెన్

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ జాక్ పాట్ కొట్టాడు. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన బాబర్.. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గానూ ఎంపికయ్యాడు. 2022కి గానూ సర్ గ్యార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. గత ఏడాది 44 మ్యాచ్‌లు ఆడిన బాబర్.. 54.12 యావరేజ్‌తో 2598 పరుగులు చేశాడు. 2022లో బాబర్ 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు చేయడం గమనార్హం. బాబర్ ఆజమ్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక కావడం వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం. ఇంతకు ముందు విరాట్ కోహ్లి మాత్రమే వరుసగా రెండేళ్లపాటు వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

గత ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 2 వేలకుపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు బాబర్ కావడం గమనార్హం. 2022లో 9 వన్డేలు ఆడిన బాబర్.. 84.87 యావరేజ్‌తో 679 రన్స్ చేశాడు. 2021 జులై నుంచి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బాబర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే పురుషుల వన్డే జట్టు 2022ను ప్రకటించిన ప్రకటించిన ఐసీసీ.. బాబర్ ఆజమ్‌ను దానికి కెప్టెన్‌గా నియమించింది.

బాబర్ సారథ్యంలో గత ఏడాది మూడు వన్డే సిరీస్‌లు ఆడిన పాక్.. మూడింటిని సొంతం చేసుకుంది. 2022లో 9 వన్డేలు ఆడిన పాక్.. ఆస్ట్రేలియా చేతిలో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడింది.

టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే.. బాబర్ పాకిస్థాన్‌ను టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌‌కు చేర్చాడు. ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన పాక్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌ల్లో మాత్రం బాబర్ బ్యాట్‌‌తో సత్తా చాటలేకపోయాడు.

కరాచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బాబర్ ఆజమ్ అద్భుత పోరాటంతో పాకిస్థాన్ డ్రాగా ముగించగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 148 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 408 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌ను 97 పరుగుల వద్ద ఆసీస్ డిక్లేర్ చేసింది. దాదాపు ఆరు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. ఆస్ట్రేలియా 506 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందుంచింది.

భారీ లక్ష్య చేధనలో పాక్ 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా.. అప్పటికీ ఐదు సెషన్ల ఆట మిగిలి ఉంది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన బాబర్ ఆజమ్ 10 గంటలపాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. పాక్‌ను ఓటమి అంచుల నుంచి బయట పడేటయంతోపాటు.. గెలిపించే ప్రయత్నం చేశాడు.

అబ్దుల్లా షఫీక్‌తో కలిసి 228 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బాబర్.. మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి 115 పరుగులను జోడించాడు. దీంతో 36 ఓవర్లలో పాక్ విజయానికి 196 రన్స్ అవసరమయ్యాయి. కానీ 425 బంతుల్లో 196 పరుగులు చేసిన బాబర్ డబుల్ సెంచరీ ముంగిట ఔటయ్యాడు. దీంతో గెలుపుపై ఆశలు వదిలేసుకున్న పాక్.. 443/7తో ఐదో రోజు ఆటను ముగించి టెస్టును డ్రాగా ముగించింది. టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన టెస్ట్ కెప్టెన్‌గా బాబర్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

2023-01-26T10:54:01Z dg43tfdfdgfd