నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గెలిచేందుకు హైదరాబాద్ ఎదుట 220 పరుగుల లక్ష్యం నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ.. 355 పరుగులు చేసి హైదరాబాద్ ఎదుట మోస్తరు లక్ష్యాన్ని నిలిపింది. కరుణ్ నాయర్ (105), అథర్వ (93) ఆ జట్టును ఆదుకున్నారు.
స్టార్ పేసర్ సిరాజ్ (3/59) మూడు వికెట్లు పడగొట్టాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్.. 6 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 23 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి మరో 197 పరుగులు చేయాల్సి ఉంది.
2025-02-01T21:26:13Z