డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 39వ జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో రెండో పతకం చేరింది. సోమవారం జరిగిన మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో రాష్ట్ర యువ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ కాంస్య పతకంతో మెరిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన పోరులో సురభి 448.8 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. సిఫ్ట్‌కౌర్‌సమ్రా (461.2, పంజాబ్), అంజుమ్ మౌద్గిల్ (458.7, పంజాబ్) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. మహిళల 3X3 బాస్కెట్‌బాల్ కేటగిరీలో తెలంగాణ ఫైనల్ చేరుకుని కనీసం రజతం ఖాయం చేసుకుంది. బీచ్ వాలీబాల్ పురుషుల, మహిళల విభాగాల్లో తెలంగాణ ముందంజ వేసింది.
2025-02-03T22:42:10Z