న్యూయార్క్ : సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో యూఎస్‌ఏకే చెందిన డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ నిష్క్రమించినా అమెరికన్ల ఆధిపత్యం కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో యూఎస్‌ఏ కుర్రాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సిస్ టియాఫో ముఖాముఖి తలపడనున్నారు. క్వార్టర్స్‌లో ఫ్రిట్జ్.. 7-6 (7/2), 3-6, 6-4, 7-6 (7/3)తో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను ఓడించాడు. మరో క్వార్టర్స్‌లో టియాఫో.. 6-3, 6-7 (7/5), 6-3, 4-1తో గ్రిగొర్ దిమిత్రోవ్ (బల్గేరియా)ను చిత్తుచేశాడు. మహిళల సింగిల్స్‌లో పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కిన్వెన్ జెంగ్ (చైనా) 1-6, 2-6తో రెండో సీడ్ అరీనా సబలెంక (బెలారస్) చేతిలో చిత్తై క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. సెమీస్‌లో సబలెంక.. అమెరికా యువ సంచలనం ఎమ్మా నవరోతో తాడో పేడో తేల్చుకోనుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీస్ చేరిన రోహన్ బోపన్న (భారత్), అల్దిలా సుత్జిజాది (ఇండోనేషియా) ద్వయం 3-6, 4-6తో టౌన్‌సెండ్-యంగ్ (అమెరికా) చేతిలో పరాభవం పాలైంది.
2024-09-04T23:49:52Z dg43tfdfdgfd