సచిన్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

ముంబై : భారత క్రికెట్‌ అభిమానుల ఆరాధ్య దైవం సచిన్‌ టెండూల్కర్‌ మరో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యాడు. బీసీసీఐ అతడిని జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించనుంది. శనివారం ముంబైలో జరుగబోయే బీసీసీఐ వార్షికోత్సవ వేడుకలలో సచిన్‌కు ఈ అవార్డును అందజేయనున్నట్టు బోర్డు ప్రతినిధి తెలిపారు. దివంగత కెప్టెన్‌ కల్నల్‌ సీ.కే. నాయుడు పేరిట అందజేసే ఈ అవార్డును అందుకోబోతున్న 31వ క్రికెటర్‌ సచిన్‌.

2025-01-31T23:25:49Z