షట్లర్లకు సన్నాహక శిబిరం

ఢిల్లీ : ఈనెల 11-16 మధ్య చైనాలోని కింగ్డవొ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్‌ బృందం కోసం బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బాయ్‌) ప్రత్యేక సన్నాహక శిబిరాన్ని ఏర్పాటుచేసింది. మంగళవారం నుంచి గువహతిలో ప్రారంభం కాబోయే ఈ శిబిరంలో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌, సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం, ప్రణయ్‌తో కూడిన 14 మంది సభ్యుల బృందం పాల్గొననుంది. ఈ టోర్నీ 2023 ఎడిషన్‌లో భారత్‌ కాంస్య పతకం గెలిచింది.

2025-02-03T22:57:09Z