ఐపీఎల్ 2025లో విజేతగా నిలిచి.. 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తెరదించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు రన్స్ తేడాతో గెలిచి ఈ ఫీట్ సాధించింది. దీంతో 18 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ.. తొలి టైటిల్ సాధించినట్లయింది. అయితే ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ చేసిన పనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శెభాష్.. పాటీదార్ అని ప్రశంసిస్తున్నారు.
2025 సీజన్‌కు ముందు ఆర్సీబీ కెప్టెన్‌గా నియమితులైన పాటీదార్, తన సారథ్యంలో తొలి సీజన్‌లోనే ఫ్రాంచైజీకి టైటిల్ అందించాడు. ఆర్సీబీకి టైటిల్ అందించిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో కోహ్లీకి కూడా ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన కోహ్లీ.. ఒకే ఫ్రాంచైజీ తరపున 18 సీజన్లలో ఆడిన ఏకైక ఆటగాడిగానూ ఉన్నాడు. అయితే ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత రజత్ పాటీదార్.. కోహ్లీని గౌరవించాడు. సాధారణంగా టైటిల్ గెలిచిన తర్వాత విన్నింగ్ కెప్టెన్ వెళ్లి.. కెమెరాపై సంతకం చేయడం ఆనవాయితీ. కానీ పాటీదార్ మాత్రం విరాట్ కోహ్లీని చేయి పట్టుకుని మరీ తీసుకెళ్లి.. సంతకం చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియో చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్.. రజత్ పాటీదార్ మెచ్చుకుంటున్నారు. నువ్వు నిజమైన కెప్టెన్.. అసలైన ఆర్సీబియన్ అని పేర్కొంటున్నారు. కాగా ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ.. సత్తాచాటాడు. 15 ఇన్నింగ్స్‌లలో 54.75 సగటుతో 144.71 స్ట్రైక్ రేట్‌తో 657 పరుగులు సాధించాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఈ సీజన్ ద్వారా రజత్ పాటీదార్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. కెప్టెన్‌గా తన తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచుకున్న నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు షేన్ వార్న్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఈ ఫీట్ సాధించారు.
2025-06-07T15:48:25Z