శాంసన్‌కు గాయం

ముంబై : టీమ్‌ ఇండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ గాయం బారిన పడ్డాడు. ఇంగ్లండ్‌తో వాంఖడే వేదికగా ముగిసిన ఆఖరి టీ20లో భాగంగా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. ఆర్చర్‌ వేసిన బంతి శాంసన్‌ కుడి చేతి చూపుడు వేలికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా సంజూ కనీసం ఐదు నుంచి ఆరు వారాల పాటు ఆటకు దూరమవనున్నాడు. దీంతో అతడు తన స్వంత రాష్ట్రం కేరళ తరఫున రంజీ క్వార్టర్స్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం కోల్పోయాడు. ఐపీఎల్‌ ప్రారంభ సమయం వరకూ సంజూ.. ఎన్‌సీఏలో పునరావాసం పొందుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

2025-02-03T22:57:09Z