ఇండియా ఏ తరఫున వెస్టిండీస్ టూర్‌కి వెళ్లినప్పుడు పుజారాకు జరిగిన ఇన్సిడెంట్‌ను రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. 2012లో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ మాటలకు అందని విధంగా ఉంటుందని, ఆ ఇన్సిడెంట్ తర్వాత వెస్టిండీస్‌లో రాత్రి 9 గంటల తర్వాత బయటకు వెళ్లలేదని పుజారా చెప్పాడు. పుజారా భార్య పూజ రాసిన 'ది డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్' అనే పుస్తకాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆవిష్కరించాడు.
పుజారా లైఫ్‌లో జరిగిన ఎన్నో సంఘటనలను పూజ ఈ బుక్‌లో పొందుపరిచారు. క్రికెట్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఇలా ముఖ్యమైన సంఘటనలు.. అదే విధంగా క్రికెటర్ వైఫ్‌గా ఉంటే ఎలా ఉంటుందోనన్న విషయాలను కూడా చర్చించారు. అయితే ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా 2012లో వెస్టిండీస్ టూర్‌కి వెళ్లినప్పటికి విషయాలను గుర్తు చేసుకున్నారు.
"నాకు తెలిసి ఇది బుక్‌లో రాసినట్టు లేరు. 2012లో వెస్డిండీస్ టూర్‌కి వెళ్లినప్పటి విషయాలు ఏమైనా పొందుపరిచారా? ఏమైంది ఏంటీ అనేది" అని రోహిత్ శర్మ పుజరాని అడిగాడు. 'నేనేం చెప్పలేదు.. నా అర్థం తనకు దానిపై అవగాహన ఉంది, కాకపోతే తనకి ఆ వివరాలు పూర్తిగా తెలియదు' అంటూ పూజరా చెప్పాడు.
ఆ రోజును గుర్తు చేసుకుంటూ పూజారా ఇలా చెప్పుకొచ్చాడు "నేను శాకాహారిని. అందువల్ల మేము రాత్రి పూట ఏమైనా వెజిటేరియన్ ఫుడ్ ఏమైనా దొరుకుతుందా అని చూస్తున్నాం. ఆ ప్లేస్ వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో, రాత్రి 11 గంటలు అయింది. మాకయితే ఎలాంటి భోజనం కనిపించలేదు. మేము వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో ఒక అటాక్‌కు గురయ్యాం. నేను దాని గురించి పూర్తిగా అయితే చెప్పలేను. ఓవరాల్‌గా స్టోరీ అయితే అది."
ఆ సంఘటన జరిగిన తర్వాత మేము పుజరాకి చెప్పాము.. ఇకపై రాత్రి పూట బయటకు వెళ్లొచ్చు. ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత అస్సలు వెళ్లొద్దని హెచ్చరించామని, ఎందుకంటే ఇది వెస్టిండీస్ అని రోహిత్ శర్మ ఆ డిస్కషన్‌లో చెప్పాడు.
2025-06-07T10:47:37Z