వన్డే, టీ20ల్లోనూ బజ్‌బాల్‌

  • ఇంగ్లండ్‌ వైట్‌బాల్‌ కోచ్‌గా మెక్‌కల్లమ్‌

లండన్‌: ‘బజ్‌బాల్‌’ ఆటతో టెస్టులలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆ జట్టు హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ తన బాధ్యతలను పరిమిత ఓవర్లకూ విస్తరించనున్నాడు. ఇంగ్లండ్‌ వైట్‌బాల్‌ టీమ్స్‌కూ మెక్‌కల్లమ్‌ను హెడ్‌కోచ్‌గా నియమిస్తూ ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తీసుకుంది.

2022లో ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు హెడ్‌కోచ్‌గా ఎంపికయ్యాక బెన్‌ స్టోక్స్‌ సారథ్యంలో అతడు ఇంగ్లీష్‌ క్రికెటర్ల ఆటతీరునే మార్చేశాడు. దూకుడే పరమావధిగా ఇంగ్లండ్‌తో ప్రత్యర్థులు టెస్టులు ఆడితే ‘డ్రా’ అనే ఆప్షన్‌ను మరిచిపోవాల్సిందే అన్నంత రేంజ్‌లో అతడు జట్టుకు మార్గనిర్దేశనం చేస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కూ పరిచయం చేసేందుకు బ్రెండన్‌ సిద్ధమయ్యాడు.

2024-09-03T20:04:23Z dg43tfdfdgfd