తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సహనం కోల్పోయాడు. ఓ మ్యాచ్ సందర్బంగా తనను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినందుకు ఓ మహిళా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు అశ్విన్ స్థాయికి ఇది తగదని కామెంట్లు చేస్తున్నారు.
ఆన్‌ఫీల్డ్‌లో ఉన్న మహిళా అంపైర్ రవిచంద్రన్ అశ్విన్ ఔట్ అయినట్లు ప్రకటించారు. ఇదే అశ్విన్ కోపానికి కారణమైంది. ఔట్ అని ప్రకటించిన తర్వాత అశ్విన్.. ఆ అంపైర్‌కు ఏదో చెప్పబోయాడు. అయితే సదరు అంపైర్ మాత్రం అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. దీంతో అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతి ఔట్‌సైడ్ పిచ్ అయిందని వాదించే ప్రయత్నం చేశాడు. అప్పటికే రెండు రివ్యూలను కోల్పోవడంతో అంపైర్ నిర్ణయంపై థర్డ్ అంపైర్ రివ్యూకు వెళ్లలేకపోయాడు. గట్టిగా అరుస్తూ పెవిలియన్ వైపు నడిచాడు. బౌండరీ లైన్ దాటుతుండగా చేతి గ్లౌజ్స్‌ను తీసి దూరంగా విసిరేశాడు. బ్యాట్‌ను బలంగా ప్యాడ్స్‌పై కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 11 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, సిక్సర్ ఉంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ జట్టు 16.2 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన తిరుప్పుర్ టీమ్.. 11.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.
2025-06-09T10:40:38Z