రూ.5 కోట్ల నజరానా

మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయంతో వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ టైటిల్‌ దక్కించుకున్న టీమ్‌ ఇండియాలో ప్లేయర్లతో పాటు సహాయక సిబ్బందికి 5 కోట్ల నజరానా ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ‘టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత మహిళల జట్టుకు అభినందనలు. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో టైటిల్‌ను తిరిగి దక్కించుకున్నారు. ఈ చిరస్మరణీయ విజయానికి గుర్తింపుగా బీసీసీఐ 5 కోట్ల నగదు ప్రోత్సాహం ప్రకించింది. చీఫ్‌ కోచ్‌ నూషిన్‌ అల్‌ ఖదీర్‌, కెప్టెన్‌ నికీ ప్రసాద్‌కు శుభాకాంక్షలు. మెగాటోర్నీలో అపజయమెరుగకుండా ప్రపంచ విజేతగా నిలువడం గర్వకారణం’ అని బోర్డు పేర్కొంది.

2025-02-02T22:56:39Z