లండన్: కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం సుమారు రెండేండ్లుగా వేచి చూస్తున్న నొవాక్ జొకోవిచ్ (సెర్బియా).. ఆ దిశగా తనకు అచ్చొచ్చిన వింబుల్డన్ మరో ముందడుగు వేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ జొకో.. 6-3, 6-2, 6-0తో బ్రిటన్ ప్లేయర్ డాన్ ఎవాన్స్‌ను చిత్తుగా ఓడించాడు. వరుస సెట్లలో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్న జొకో.. మూడో రౌండ్‌కు ప్రవేశించాడు.
మహిళల సింగిల్స్‌లో 8వ సీడ్ పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్.. ??? క్యాటీ మ్యాక్‌నాలి (అమెరికా) పై గెలిచి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఆమెతో పాటు రిబాకినా (కజకిస్థాన్), మిర్రా అండ్రీవా, పదో సీడ్ ఎమ్మా నవర్రొ (యూఎస్), డిఫెండింగ్ చాంపియన్ క్రెజికొవ (చెక్ రిపబ్లిక్) ముందడుగు వేశారు. పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్), రెయిస్ వరెల (మెక్సికో) ద్వయం.. 6-4, 6-4తో లర్నర్ టైన్, కొవసెవిక్ (యూఎస్) జోడీని ఓడించి రెండో రౌండ్‌కు చేరింది.
2025-07-03T20:55:46Z