ముచ్చర్లలో అంతర్జాతీయ స్టేడియం

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: రాష్ట్రంలో క్రికెట్‌ సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే కచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక స్టేడియం నిర్మించాలని, హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వాన్ని హెచ్‌సీఏ కోరింది. హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాసరావు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఇటీవలే వినతిపత్రం అందజేశారు. అయితే బుధవారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే క్రమంలో ముచ్చర్లలో స్పోర్ట్స్‌ హబ్‌, అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని సీఎం ప్రకటించారు. ఇందుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

2024-07-31T23:34:32Z dg43tfdfdgfd