హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం ఇంటర్‌కాంటినెంటల్ కప్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ ఎలాంటి గోల్ లేకుండా డ్రాగా ముగిసింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో తమ(124) కంటే 55 ర్యాంక్‌లు తక్కువగా ఉన్న మారిషస్(179)ను భారత్ నిలువరించలేకపోయింది. కోచ్‌గా మనాలో మార్వెజ్ తన తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టలేకపోయాడు.
రౌండ్ రాబిన్‌లో భాగంగా ఈనెల 9న భారత్, సిరియాతో తలపడనుంది. అంతకుముందు ఆతిథ్య భారత్, మారిషస్ జట్ల మధ్య మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి టోర్నీని అధికారికంగా ప్రారంభించి ఇరు జట్ల ప్లేయర్లతో కరాచలనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు కల్యాణ్ బౌచే, మంత్రి పొన్నం ప్రభాకర్, సాట్‌జీ చైర్మన్ శివాసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2024-09-03T20:34:28Z dg43tfdfdgfd