భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్ టైమింగ్స్, వేదికలివే

IND vs AUS Odi Series : భారత్ గడ్డపై టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు (Australia)ని ఓడించిన టీమిండియా (Team India).. శుక్రవారం నుంచి వన్డే సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1తో భారత్ (India) జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 17 నుంచి వరుసగా మూడు వన్డేలని కంగారూలతో టీమిండియా ఆడబోతోంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్‌ని కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించేసింది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య (India vs Australia) ఈ నెల 17న ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత 19న విశాఖపట్నంలో రెండో వన్డే, 22న చెన్నైలో మూడో వన్డే జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ వన్డే సిరీస్‌‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇరు జట్ల ఆటగాళ్లు ఫామ్ అందుకోవడానికి లేదా హిట్టింగ్ ప్రాక్టీస్ కోసం ఈ సిరీస్‌ని ఉపయోగించుకునే ఛాన్స్ ఉందని మాజీ క్రికెటర్లు జోస్యం చెప్తున్నారు.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్ధూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్

ఆస్ట్రేలియా వన్డే జట్టు: డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మార్కస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, మర్కస్ స్టాయినిస్, కామెరూన్ గ్రీన్, అస్టన్ అగర్, సీన్ అబాట్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్, ఆడమ్ జంపా

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

2023-03-15T09:43:48Z dg43tfdfdgfd