బంగ్లా సిరీస్‌ వాయిదా!

న్యూఢిల్లీ: భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్‌లో తీవ్ర అలజడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిరీస్‌ వాయిదా వేసేందుకు బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఆగస్టు 17 నుంచి 31వ తేదీ వరకు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడాల్సి ఉంది.

కానీ బంగ్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కల్గిస్తున్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికైతే సిరీస్‌లు రద్దు కాలేదని, 2026 మొదట్లో జరిగే అవకాశమున్నట్లు తెలిసింది.

2025-07-04T21:10:48Z