రావల్పిండి: టెస్టులలో పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపై ఓడించాలన్న కలను బంగ్లాదేశ్ రెండు దశాబ్దాల తర్వాత నెరవేర్చుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టు ఐదో రోజు ఆటలో పర్యాటక జట్టు విజయానికి 143 పరుగులు (లక్ష్యం 185) అవసరం ఉండగా బంగ్లా బ్యాటర్లు 56 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చారిత్రాక విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇదే వేదికపై బంగ్లాదేశ్ తొలి టెస్టునూ గెలుచుకున్న విషయం విదితమే. 2001 నుంచి ఈ ఇరు జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌లు జరుగుతుండగా పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్ గెలవడం బంగ్లాకు ఇదే మొదటిసారి.
2021 తర్వాత టెస్టులలో గెలుపు మొహం వాచిన పాక్.. బంగ్లాతోనూ ఓడటంతో ఓటమిని పరిపూర్ణం చేసుకుంది. ఈ ఓటమితో టెస్టు ఆడే అన్ని దేశాలకూ సొంతగడ్డలో టెస్టు సిరీస్‌లు సమర్పించుకున్న రెండో జట్టుగా పాక్ (తొలిస్థానంలో బంగ్లా) నిలిచింది. బంగ్లాదేశ్‌కు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం కాగా పరాయిగడ్డపై 8వ టెస్టు గెలుపు.
2024-09-03T20:19:25Z dg43tfdfdgfd