బ్రూక్‌ ఈజ్‌ బ్యాక్‌

  • వరల్డ్‌కప్‌నకు
  • ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన

లండన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌.. వన్డే ప్రపంచకప్‌ జట్టులో మార్పులు చేసింది. స్టార్‌ ఓపెనర్‌ జాసెన్‌ రాయ్‌ స్థానంలో.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దంచికొడుతున్న హ్యారీ బ్రూక్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు ఆదివారం 15 మందితో కూడిన సవరించిన జట్టును ప్రకటించింది.

అంతకుముందు వన్డే క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికిన బెన్‌ స్టోక్స్‌ను బతిలాడి రిటైర్మెంట్‌ నుంచి వెనక్కి రప్పించిన ఇంగ్లండ్‌.. ఈ సారి మిడిలార్డర్‌ బ్యాటర్‌ బ్రూక్‌ కోసం రాయ్‌పై వేటు వేసింది. అయితే రాయ్‌ గాయంతో బాధపడుతుండటంతోనే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తున్నది. ‘వరల్డ్‌కప్‌ వంటి మెగటోర్నీ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు’ అని ఇంగ్లండ్‌ సెలెక్టర్‌ ల్యూక్‌ రైట్‌ పేర్కొన్నాడు.

2023-09-17T21:24:14Z dg43tfdfdgfd