ఫైనల్‌కు మరో ఐదుగురు బాక్సర్లు

అస్తానా: వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌లో భారత బాక్సర్లు పతక జోరు కనబరుస్తున్నారు. వేర్వేరు విభాగాల్లో ఫైనల్‌ చేరడం ద్వారా మన బాక్సర్లు ఇప్పటి వరకు ఆరు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. శనివారం జరిగిన మహిళల 48కిలోల సెమీఫైనల్‌ బౌట్‌లో మీనాక్షి 5-0 తేడాతో నుర్సులెన్‌ యాల్గెటెకిన్‌(టర్కీ)పై అద్భుత విజయం సాధించింది. 54కిలోల సెమీస్‌ బౌట్‌లో సాక్షి.. ఫెరుజా కజాకోవా(ఉజ్బెకిస్థాన్‌)పై అలవోకగా గెలిచింది.

80కిలోల సెమీస్‌ పోరులో ఒలింపియన్‌ పూజారాణి 3-2తో ఎలిఫ్‌ గునెరీ(టర్కీ)ని ఓడించింది. దీంతో నలుగురు మహిళా బాక్సర్లు ఫైనల్‌ చేరినట్లయ్యింది. మరోవైపు పురుషుల 70కిలోల సెమీస్‌లో హితేశ్‌ గులియా..మకాన్‌ త్రారోర్‌(ఫ్రాన్స్‌)ను చిత్తుగా ఓడించాడు. 85కిలోల సెమీస్‌ పోరులో జుగ్ను 5-0తో టీగాన్‌ స్కాట్‌(ఇంగ్లండ్‌)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు.

2025-07-05T19:55:48Z