అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. దాంతో మొదటి ఇన్నింగ్స్‌లోని ఆధిక్యంతో కలుపుకొని భారత్‌కు 357 పరుగుల ఆధిక్యంలో ఉంది.
64/1 స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా దూకుడుగానే అడుగులు వేస్తోంది. మొదటి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. నాలుగో రోజు ఆటలో కరుణ్ నాయర్ మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే వికెట్ కోల్పోయాడు. 46 బంతులు ఆడిన నాయర్ 5 ఫోర్లు బాది 26 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 84 బంతుల్లో 10 ఫోర్లతో 55 పరుగులు చేసి అవుటయ్యాడు.
కేఎల్ రాహుల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ బౌండరీల మోత మోగిస్తున్నాడు. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కలిసి డ్రింక్స్ బ్రేక్ తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రిషబ్ పంత్ తనదైన స్టయిల్‌లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 35 బంతులు ఆడిన పంత్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. కెప్టెన్ శుభమన్ గిల్ 41 బంతుల్లో మూడు ఫోర్లతో 24 పరుగులు చేశారు. లంచ్ బ్రేక్ సమయానికి వీరిద్దరూ క్రీజులో కొనసాగుతున్నారు.
మొదటి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ గిల్ 269 పరుగులతో రాణించడంతో టీమిండియా 587 పరుగులు చేసింది. గిల్‌తో పాటు జైస్వాల్ 87, రవీంద్ర జడేజా 89 పరుగులు చేశారు. ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ సెంచరీలు చేయడంతో 407 పరుగులు చేయగలిగింది. మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
2025-07-05T12:37:51Z