ముంబై: వరుసగా నాలుగోసారి ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్ చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. ఇక వన్డే సమరానికి సిద్ధమవుతున్నది. భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. అందుకోసం మన ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు.
బుధవారం వాంఖడేలో స్టాండిన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, జైదేవ్ ఉనాద్కట్ సాధన కొనసాగించారు. సూర్య, ఇషాన్ భారీ షాట్లు ప్రాక్టీస్ చేయగా.. పాండ్యా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ సాధన కొనసాగించాడు.
2023-03-15T19:35:08Z dg43tfdfdgfd