పోరాడి ఓడిన భారత్‌.. మూడో టీ20లో ఇంగ్లండ్‌ విజయం

ఓవల్‌: ఇంగ్లండ్‌తో హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైంది. ఇంగ్లిష్‌ జట్టు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మందన (56), షెఫాలీ వర్మ (47) జట్టుకు మెరుగైన శుభారంభం అందించారు.

వీరిద్దరూ తొలి వికెట్‌కు 85 రన్స్‌ జోడించారు. విజయానికి 6 బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కౌర్‌ చివరి బంతికి ఔట్‌ కావడంతో భారత్‌ ఓటమి వైపు నిలిచింది.

2025-07-05T19:55:46Z