నీరజ్‌కు రెండో స్థానం

న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా.. డైమండ్‌ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. అమెరికా వేదికగా జరిగిన టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ బరిసెను 83.80 మీటర్ల దూరం విసిరాడు. నిరుడు ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన నీరజ్‌ ఈసారి అలాంటి ప్రదర్శన పునారవృతం చేయలేకపోయాడు.

గత నెలలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన నీరజ్‌.. ఆదివారం తెల్లవారుజామున జరిగిన పోటీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. మొత్తం ఆరు ప్రయత్నాల్లో రెండింట్లో ఫౌల్‌ చేసిన నీరజ్‌.. రెండో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్‌ వాడ్లెచ్‌ బరిసెను 84.24 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా నిలిచాడు.

2023-09-17T21:24:14Z dg43tfdfdgfd