నాగ్‌పూర్ : విదర్భతో జరుగుతున్న రంజీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ అదరగొడుతున్నది. తమ సూపర్ బౌలింగ్‌తో విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేసిన హైదరాబాద్.. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల స్కోరు చేయడంతో ఆ జట్టుకు 136 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (136) సూపర్ సెంచరీతోవిజృంభించాడు.యశ్ ఠాకూర్(3/80) రాణించాడు. విదర్భ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 56/2 పరుగులు చేసింది.
తన్మయ్‌కు నజరానా : ఈ రంజీ సీజన్‌లో సూపర్‌ఫామ్‌మీదున్న తన్మయ్ అగర్వాల్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు తన సొంత నిధుల నుంచి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. ఇప్పటికే ఆడిన 7 మ్యాచ్‌ల్లో తన్మయ్ 928 పరుగులతో కొనసాగుతున్నాడు. విదర్భతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన జగన్..హైదరాబాద్ ప్లేయర్లు సిరాజ్, మిలింద్, తన్మయ్, తనయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
2025-01-31T23:25:49Z