ఢిల్లీ కెప్టెన్‌గా వార్నర్‌

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కారు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న రిషభ్‌ పంత్‌ స్థానంలో వార్నర్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు జట్టు యాజమాన్యం వెల్లడించింది.

ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ జట్టు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ యేడాది ఐపీఎల్‌ మార్చి 31నుంచి ఆరంభం కానున్నది.

2023-03-16T22:20:35Z dg43tfdfdgfd