టీమిండియా క్రికెటర్ సిరాజ్‌కు విగ్రహం పెట్టారా.. ఈ ఫోటోలో నిజమెంత?
![]()
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. మహమ్మద్ సిరాజ్‌కు కాంస్య రంగు విగ్రహాలు ఏర్పాటు చేశారంటూ ఫోటోలు కొందరు వైరల్ చేస్తున్నారు. ఈ పోస్టులకు వేల సంఖ్యలో నెటిజన్ల నుంచి లైక్‌లు వస్తున్నాయి. దీంతో సిరాజ్ విగ్రహాల అంశంపై చర్చ జరుగుతోంది. మరి నిజంగానే మహమ్మద్ సిరాజ్‌కు కాంస్య రంగు విగ్రహం ఏర్పాటు చేశారా?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల్లో నిజమెంతో ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలుసుకుందాం..
క్లెయిమ్ ఏంటి?
మహమ్మద్ సిరాజ్‌కు కాంస్య రంగులో విగ్రహాలు ఏర్పాటు చేశారంటూ ఫోటోలను వైరల్ చేశారు. సిరాజ్ బాల్‌ను పట్టుకున్నట్లుగా రెండు ఫోటోలు కలిపి షేర్ చేశారు. బీసీసీఐ లోగోను పోలిన లోగో.. టీ షర్ట్‌లో విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో 'మహమ్మద్ సిరాజ్ విగ్రహం' అంటూ ఈ ఫోటోను షేర్ చేశారు. (ఆర్కైవ్) అలాంటి క్లెయిమ్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. (ఆర్కైవ్, ఆర్కైవ్, ఆర్కైవ్) గమనించొచ్చు.
వాస్తవం ఏంటి?
సోషల్ మీడియాలో మహమ్మద్ సిరాజ్ పేరుతో వైరల్ చేస్తున్న కాంస్య రంగు విగ్రహాలు తప్పని తేలింది. ఇది ఏఐ (Artificial Intelligence) ద్వారా రూపొందించిన ఫోటోగా గుర్తించడం జరిగింది.
ఎలా నిర్థారించామంటే?
ఈ వైరల్ ఫోటోలకు సంబంధించి కొన్ని కీవర్డ్స్ ద్వారా సెర్చ్ చేయడం జరిగింది. గతంలో సిరాజ్ విగ్రహాల ఏర్పాటు చేశారేమోనని వెతికితే.. ఎక్కడా తగిన రిపోర్ట్స్ దొరకలేదు. అలాగే రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వైరల్ ఫోటోకు ఎలాంటి మ్యాచ్ అయ్యేలా ఫోటోలు దొరకలేదు. దీన్ని బట్టి ఈ ఫోటో నిజం కాదని నిర్థారించడం జరిగింది. ఈ వైరల్ ఫోటోలో విగ్రహం బ్యాగ్రౌండ్ గమనిస్తే.. కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. అప్పుడు ఈ వైరల్ ఫోటోలు ఏఐ (Artificial Intelligence)తో రూపొందించారేమోనని చెక్ చేయడం జరిగింది.హైవ్ మోడరేషన్ ద్వారా చెక్ చేస్తే.. 99.9శాతం ఏఐ ద్వారా రూపొందించిన ఫోటో & డీప్ ఫేక్ ఫోటోగా కావొచ్చని తేలింది. సైట్ ఇంజిన్ ఏఐ ద్వారా రూపొందించినట్లుగా 99 శాతం నిర్ధారించింది. కొంతకాలంగా ప్రముఖుల ఏఐ ఫోటోలు, డీప్ ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడతూ తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు ప్రముఖుల ఏఐ ఫోటోలు, డీప్ ఫేక్ ఫోటోలపై ఫ్యాక్ట్ చెక్ చేయగా ఫేక్ అని తేలింది.
తీర్పు
దీన్ని బట్టి మహమ్మద్ సిరాజ్ క్యాంస రంగు విగ్రహాల పేరుతో వైరల్ అవుతున్న ఫోటోలు ఏఐ ద్వారా రూపొందించినట్లు తేలింది.. ఇవి నిజం కాదు.(This Story was Originally Published By NewsMeter, And edited and republished by TIL Telugu (Samayam) as part of the Shakti Collective)
2025-02-01T08:15:18Z