టాటా చెస్‌ చాంపియన్‌ ప్రజ్ఞానంద

  • టైబ్రేకర్‌లో గుకేశ్‌ ఓటమి

విజ్కాంజీ (నెదర్లాండ్స్‌ : ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ చెస్‌ మాస్టర్స్‌ టైటిల్‌ను భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద గెలుచుకున్నాడు. 19 ఏండ్ల ఈ చెన్నై చిన్నోడు.. ఆదివారం రాత్రి ఉత్కంఠగా జరిగిన టైబ్రేకర్‌లో మరో యువ సంచలనం, ప్రపంచ నంబర్‌వన్‌ దొమ్మరాజు గుకేశ్‌పై 2-1తేడాతో నెగ్గి తొలిసారి ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. 13వ రౌండ్‌ తర్వాత గుకేశ్‌, ప్రజ్ఞానంద.. తలా 8.5 పాయింట్లతో నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేకర్‌ నిర్వహించగా.. ఆ పోరులో ప్రజ్ఞానందనే గెలుపు వరించింది. తాజా విజయంతో ప్రజ్ఞానంద.. 2006 తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.

2025-02-03T22:27:10Z