హైదరాబాద్, ఆట ప్రతినిధి: నగరంలోని గాడియం పాఠశాల పదో వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని రెండురోజుల పాటు నిర్వహించిన జిమ్‌క్వీన్-2024 పోటీలు విజయవంతంగా ముగిశాయి. గాడియం స్పోర్టోపీయాలో జరిగిన ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా సుమారు 600 మంది అథ్లెట్లు పాల్గొనగా.. ఆతిథ్య గాడియం జిమ్నాస్ట్‌లు ఏకంగా 170 పతకాలు కొల్లగొట్టడం విశేషం. లెవల్ 1, 2 పోటీల్లో ఆ స్కూల్ విద్యార్థులు 146 పతకాలు సాధించగా అందులో 96 స్వర్ణాలున్నాయి. మిగిలిన విభాగాల్లో 24 పతకాలు సొంతం చేసుకున్న విద్యార్థులను గాడియం వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ కీర్తిరెడ్డి అభినందించారు.
2024-07-30T00:11:49Z dg43tfdfdgfd