న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్స్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ), డేనియల్ మెద్వెదెవ్ (రష్యా) క్వార్టర్స్‌లో తలపడబోతున్నారు. పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో సిన్నర్.. 7-6 (7/3), 7-6 (7/5), 6-1తో టామీ పాల్ (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించి క్వార్టర్స్‌కు చేరాడు. రెండు సెట్‌లు టైబ్రేకర్‌లకు దారితీసిన ఈ మ్యాచ్‌లో సిన్నర్ 10 ఏస్‌లు కొట్టగా పాల్ 4 మాత్రమే సాధించాడు.
రెండు సెట్‌లలోనూ సిన్నర్‌తో నువ్వానేనా అన్నట్టుగా పోరాడిన పాల్.. మూడో సెట్‌లో మాత్రం చేతులెత్తేశాడు. సెమీస్ పోరు కోసం సిన్నర్, మెద్వెదెవ్ మధ్య బుధవారం ఆసక్తికర పోరు జరుగనుంది. పురుషుల డబుల్స్‌లో నిరాశపరిచిన భారత ఆటగాడు బోపన్న మిక్స్‌డ్ డబుల్స్‌లో సుజియాదితో కలిసి సెమీస్ చేరాడు.
2024-09-03T19:49:22Z dg43tfdfdgfd