క్వార్టర్స్‌లో గాయత్రి జోడీ

బర్మింగ్‌హామ్‌: అల్‌ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ జోడి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. కాగా పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ ప్రిక్వార్టర్స్‌లో ఇంటిదారిపట్టాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి-ట్రెసా 21-14, 24-22 స్కోరుతో జపాన్‌కు చెందిన ఫకుషిమ-హిరోట జోడిపై విజయం సాధించారు.

పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ వరుస గేమ్‌లలో 13-21, 15-21తో డెన్మార్క్‌కు చెందిన ఆండర్స్‌ ఆంటొన్సెన్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి మూడు గేమ్‌ల పోరులో ఓడిపోయారు. చైనా జోడి లియాంగ్‌ వీ కెంగ్‌-వాంగ్‌ చాంగ్‌ 10-21, 21-17, 21-19తో సాత్విక్‌-చిరాగ్‌లపై గెలుపొందింది.

2023-03-16T21:20:40Z dg43tfdfdgfd