క్వార్టర్స్‌కు శంకర్‌

కాల్గరి: కెనడా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 టో ర్నీలో భారత యువ షట్లర్‌ శంకర్‌ ముత్తుస్వామి సుబ్రహ్మణ్యన్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శంకర్‌.. 21-19, 21-14తో తైవాన్‌ షట్లర్‌ హుయాంగ్‌ను ఓడించాడు.

క్వార్టర్స్‌లో శంకర్‌.. నిషిమొటొ (జపాన్‌)తో తలపడనున్నాడు. భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ సైతం క్వార్టర్స్‌ చేరిన విషయం విదితమే.

2025-07-04T21:10:48Z