ఢిల్లీ వేదికగా ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో యువ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. టోర్నీలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరఫున ఆడుతున్న ప్రియాన్ష్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఎవరికీ అందని రీతిలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇటీవల నార్త్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదాడు. దీంతో దేశంలోని క్రికెట్ అభిమానులను తనవైపు తిప్పుకున్నాడు. క్లీన్ స్ట్రైకింగ్‌తో శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 50 బంతుల్లోనే 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 రన్స్ చేశాడు.
ఈ మ్యాచ్ కంటే ముందుకు కూడా ప్రియాన్ష్ మెరుగ్గా రాణించాడు. ఈ టోర్నీలో నార్త్ ఢిల్లీతో మ్యాచ్‌కు మందు వరకు అతడు 57 (30), 82 (51), 53 (32), 45 (26), 107*(55), 88 (42), 24 (9) గణాంకాలను నమోదు చేశాడు. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ జట్టు పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటంలో కీలక పాత్ర పోషించాడు.
పవర్‌పుల్ బ్యాటింగ్‌తో బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రియాన్ష్ ఆర్యా.. ఐపీఎల్ 2025కి ముందు జరిగే వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడనే అంచనాలు నెలకొన్నాయి. ప్రియాన్స్ ఆర్యా 2019లో అండర్-19లో ఇండియా-ఎ తరఫున ప్రస్తుతం భారత సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌తో కలిసి ఆడాడు.
తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటుతున్న ఈ 23 ఏళ్ల ప్లేయర్.. ఐపీఎల్ గురించి, తనకు ఇష్టమైన క్రికెటర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 18వ నెంబర్ జెర్సీని ధరించే ప్రియాన్ష్ ఆర్యా.. తనకు విరాట్ కోహ్లీ ఆరాధ్య దైవమని చెప్పుకొచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలనే తన కోరిక అని తన మనసులోని మాటను చెప్పేశాడు. ఛాన్స్ వస్తే తప్పకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతానంటూ కుండ బద్దలు కొట్టేశాడు.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటుతున్న ప్రియాన్ష్ ఆర్యాను.. జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో అతడిని ఎవరు కొనుగోలు చేస్తారు? ఏ జట్టు తరఫున ఆడతాడో? తేలిపోనుంది.
ప్రస్తుతం తాను ఐపీఎల్ వేలంపై ఆలోచించడం లేదని ప్రియాన్ష్ చెప్పాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో 9 ఇన్నింగ్స్‌లలో 602 పరుగులు చేశాడు ప్రియాన్ష్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. రెండు సెంచరీలు సైతం చేశాడు. సుమారు 200 స్ట్రైక్ రేటుతో అతడు ఈ పరుగులు చేయడం గమనార్హం.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-09-02T18:14:26Z dg43tfdfdgfd