KKR New Captain : ఐపీఎల్ 2023 (IPL 2023) ముంగిట కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ఫ్రాంఛైజీ కొత్త కెప్టెన్ వేటలో పడింది. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్‌తో మొహాలి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తన మొదటి మ్యాచ్‌ని ఆడబోతోంది. కానీ.. అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇటీవల ముగిసిన నాలుగో టెస్టులో ఆడుతూ శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. గత ఏడాది కోల్‌కతా జట్టుని కెప్టెన్‌గా నడిపించిన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer).. ఐపీఎల్ 2023 ఫస్ట్ హాఫ్ మ్యాచ్‌లకి దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా వెన్ను గాయంతో శ్రేయాస్ అయ్యర్ బాధపడుతున్న విషయం తెలిసిందే.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 17 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. గాయంతో ఈ సిరీస్‌కి కూడా శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. అలానే ఐపీఎల్‌లోనూ అతను లేని లోటు కోల్‌కతా జట్టులో పూడ్చలేనిది. కెప్టెన్‌గానే కాదు.. టాప్ ఆర్డర్‌లో ఓ మంచి బ్యాటర్ సేవల్ని ఆ జట్టు కోల్పోయినట్లే. అయితే.. కోల్‌కతా ఫ్రాంఛైజీ కెప్టెన్ వేటలో అనూహ్యంగా ఓ ప్లేయర్ పేరు తెరపైకి వచ్చింది. అతను ఎవరో కాదు.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా తొలుత వెలుగులోకి వచ్చి ఆ తర్వాత బ్యాటర్‌గా ఐపీఎల్‌లో అదరగొట్టేసిన రింకు సింగ్ (Rinku Singh). ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ 25 ఏళ్ల ప్లేయర్ ఇప్పటి వరకూ భారత్ తరఫున కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ.. 2013 నుంచి దేశవాళీలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు.
వాస్తవానికి రింకు సింగ్ కంటే అనుభవజ్ఞులు, మెరుగైన బ్యాటర్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో సునీల్ నరైన్, టిమ్ సౌథీ, నితీశ్ రాణా, షకీబ్ అల్ హసన్ తదితర పేర్లు కూడా వినిపించాయి. కానీ.. రింకు సింగ్ పేరు తెరపైకి ఎలా వచ్చిందంటే? కోల్‌కతా నైట్‌రైడర్స్ సోషల్ మీడియా టీమ్ ఇన్‌స్టాలో లీక్ చేసేసింది. రింకు సింగ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను షేర్ చేసిన ఆ టీమ్.. నెటిజన్ కామెంట్‌కి రిప్లై ఇస్తూ రింకు సింగ్ మా కెప్టెన్ అంటూ కామెంట్ చేసింది. కానీ.. వెంటనే ఆ కామెంట్‌ని డిలీట్ చేసింది. కానీ.. అప్పటికే నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసుకుని షేర్ చేస్తున్నారు.
ఇప్పటి వరకూ 17 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన రింకు సింగ్ చేసిన పరుగులు 251 మాత్రమే. కానీ.. ఇందులో 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 42 పరుగులు. అయితే.. బంతిని బలంగా బాదగలడనే పేరు రింకు సింగ్‌కి ఉంది. మరీ ముఖ్యంగా.. స్కూప్, స్వీప్ షాట్స్ ఆడటంలో రింకు సింగ్ ఎక్స్‌ఫర్ట్. ఇక ఫీల్డింగ్‌లో అతనికి తిరుగులేదు. మైదానంలోని ఏ ప్రదేశంలోనైనా అద్భుతంగా డైవ్ చేస్తూ బంతిని అందుకోగలడు.
Read Latest
,
,
2023-03-15T11:28:46Z dg43tfdfdgfd